‘ఐఎన్‌ఎస్‌ కులీష్‌’ కంబోడియా పర్యటన | - | Sakshi
Sakshi News home page

‘ఐఎన్‌ఎస్‌ కులీష్‌’ కంబోడియా పర్యటన

Sep 14 2026 3:38 AM | Updated on Sep 14 2026 3:38 AM

సింథియా(విశాఖ): భారత నౌకాదళం, రాయల్‌ కంబోడియన్‌ నేవీ మధ్య సముద్ర సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఇరుదేశాల నౌకాదళ సిబ్బంది మధ్య వృత్తిపరమైన సంబంధాలను పెంచడమే లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ కులీష్‌ కంబోడియాలోని రీమ్‌ నేవల్‌ బేస్‌కు చేరుకుంది. నౌక రీమ్‌ నేవల్‌ బేస్‌కు చేరుకున్న సందర్భంగా రాయల్‌ కంబోడియన్‌ నేవీ ప్రతినిధులు, కంబోడియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ పర్యటనలో వృత్తిపరమైన సమావేశాలు, నౌకాదళ పరిచయ కార్యక్రమాలు, క్రీడా పోటీలు, వివిధ నౌకాదళ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. వీటి ద్వారా ఇరుదేశాల సిబ్బంది తమ జ్ఞానాన్ని, అనుభవాలను పరస్పరం పంచుకుని సముద్ర కార్యకలాపాల్లో సమన్వయాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉందని నేవీ వర్గాలు తెలిపాయి.ఈ పర్యటన ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారతదేశ సముద్ర సంబంధాలను విస్తరించే ప్రయత్నాల్లో భాగమని, భారతదేశ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’, ‘మ్యూచువల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఎక్రాస్‌ రీజియన్‌’ (సాగర్‌) దృష్టికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement