కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Sep 14 2026 3:38 AM | Updated on Sep 14 2026 3:38 AM

అనకాపల్లి టౌన్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు హెచ్‌ఆర్‌ పాలసీని అమ లు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన యూపీహెచ్‌సీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెద్య సేవలు అందించడంలో కాంట్రాక్ట్‌ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కనీసవేతనాలు అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం యూపీహెచ్‌సీ ఎంప్లాయీస్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి.రమణబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.జయబాబు, కోశాధికారిగా శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా డి.హరిబాబు, ఉపాధ్యక్షుడిగా రామరావు, జాయింట్‌ సెక్రటరీలుగా పార్వతి, సునీత ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement