నాతవరం : ఎట్టకేలకు తాండవ స్పిల్‌వే గేట్లు మరమ్మతులు చేస్తున్నారు. జిల్లాలోనే మేజర్ ప్రాజక్టు తాండవ రిజర్వాయరు నిర్మాణ సమయం దగ్గరుంచి స్పిల్‌వే గేట్లు సుమారుగా 53 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. కొంత కాలంగా స్పిల్‌వే గేట్లు దెబ్బతిన్నాయి. తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరినప్పుడు తాండవ ప్రమాదాన్ని నివారించడానికి అత్యవసర సమయంలో నదిలోకి నీరు విడుదల చేసేటప్పుడు అనేకసార్లు గేట్లు మొరాయించిన సందర్భాలు ఉన్నాయి. భారీ వర్షాలు, తుపానుల సమయంలో ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగితే ప్రమాదస్థాయి నీటి మట్టాన్ని తగించేందుకు స్పిల్‌వే గేట్లు ప్రఽధాన పాత్ర షోషిస్తాయి. ఈ నేపథ్యంలో తాండవ అఽధికారులు ఆధ్వర్యంలో తాండవ స్పిల్‌వే గేట్లు మూడు రోజులుగా ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ ఏడాది తాండవలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో స్పిల్‌వే గేట్ల మరమ్మతులకు వీలుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


