దేవరాపల్లి: మారేపల్లి పాండవుల మెట్టపై ఓం భారత్ శక్తి పీఠం నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో గురూజీ భారతానంద మహరాజ్ పర్యవేక్షణలో రాతితో అరుంధతి, వశిష్ఠుల వారి ఆలయం, భారతమాత, సప్తరుషుల ధ్యాన మందిరంతో పాటు అనాధలు, వికలాంగులు, వృద్దులు, సన్యాసులకు ఒకే చోట ఆశ్రమాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, రాధా మనోహర రామదాసు స్వామీజీ, కమలానంద భారతీ స్వామీజీ, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ, శంకరానంద స్వామీజీ పాల్గొన్నారు.


