అనకాపల్లి: పోలీస్ శాఖలో 35 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి డీఎస్పీగా పదవీ విరమణ పొందిన జి.ఆర్.ఆర్.మోహన్‌ను స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రం ఎదురుగా బొడ్డేడ కన్వెన్షన్ హాల్లో బుధవారం శాలువాలతో సత్కరించి, మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ మోహన్ 1991 బ్యాచ్‌లో ఎస్‌ఐగా పోలీస్‌శాఖలో ప్రవేశించి, వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి డీఎస్పీగా పదోపోన్నతి పొంది పదవీవిరమణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, ఈ.శ్రీనివాసరావు, బి.మోహన్‌రావు, మురళీకృష్ణ, కె.రవికుమార్, సీఐలు టి.లక్ష్మీ, బాలసూర్యారావు, రామకృష్ణ, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.


