ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

అనకాపల్లి: వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్‌ చేయాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు అసోసియేషన్‌ జిల్లా జేఏసీ చైర్మన్‌ జయలక్ష్మి అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నోటికి నల్లమాస్క్‌లు ధరించి, ప్లకార్డులతో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రిలో చాలీచాలనీ జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్‌ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా నాయకులు మోనిక, శివ, బి.పార్వతి, ఎం.రామలక్ష్మి, ఎం.దుర్గా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement