వై.ఎస్‌.జగన్‌ను కలిసిన జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

వై.ఎస్‌.జగన్‌ను కలిసిన జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

నక్కపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి దంపతులు కలిశారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జగనన్నను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, తనను జిల్లా బీసీ సెల్‌ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోను అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జగన్‌ సూచించినట్టు ఆయన చెప్పారు. జగన్‌ను కలిసిన వారిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్సి శీరం నర్సింహమూర్తి, నక్కపల్లి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ యలమంచిలి తాతబాబు, సింహాచలం దేవస్థానం మాజీ సభ్యురాలు శేషారత్నం, దేవవరం తాజా మాజీ సర్పంచ్‌ గొర్ల రాఘవకుమారి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement