● ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
● అబ్బురపరిచిన పులి వేషధారణలు
దేవరాపల్లి: ఓనం వేడుకలను స్థానిక కై రళీ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ ఎం.కె.దినేష్, ప్రిన్సిపాల్ లిస్సీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానిక విద్యార్థులు, కేరళ మహిళా ఉపాధ్యాయులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. విద్యాలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మహాబలి రాజు, పులి వేషధారణలు, పులికలి టైగర్స్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


