సినిమా రాజధానిగా విశాఖ | - | Sakshi
Sakshi News home page

సినిమా రాజధానిగా విశాఖ

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

కొమ్మాది: భవిష్యత్తులో విశాఖ సినిమా రాజధానిగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌ చైర్మన్‌ భరత్‌ భూషణ్‌, ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేష్‌ తెలిపారు. తిమ్మాపురంలోని వైజాగ్‌ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ‘సినీ సెలిబ్రిటీ గాలా ఫిల్మ్‌ అవార్డ్స్‌– 2026’కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. విశాఖ ఇప్పటికే గూగుల్‌, ఐటీ రంగాల్లో ముందంజలో ఉందని, త్వరలోనే సిని మా రంగంలో కూడా కీలక కేంద్రంగా మారుతుందన్నారు. సినిమా షూటింగ్స్‌కు అనుకూలంగా మౌలిక సదుపాయాలు ఏర్పా టు చేయడంతో పా టు డబ్బింగ్‌ స్టూడియోలు, ఎడిటింగ్‌ సౌకర్యాలు వంటి అవసరమైన అన్ని వనరులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ప్రతిష్టాత్మక నంది అవార్డులను కూడా విశాఖలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాలెంట్‌ వేవ్‌ స్టూడియోస్‌ లోగోను ఆవిష్కరించారు. నటీనటులు హెబ్బా పటేల్‌, శ్రీ సత్య ప్రకా శ్‌, కాశీ విశ్వనాథ్‌, షణ్ముక్‌, సేతురామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement