వినూత్న ప్రాజెక్టుతో ఆకట్టుకున్న నాగజ్యోతి | - | Sakshi
Sakshi News home page

వినూత్న ప్రాజెక్టుతో ఆకట్టుకున్న నాగజ్యోతి

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

రోలుగుంట: విద్యార్థుల అభ్యసనాన్ని మరింత సులభతరం, ఆసక్తికరం ఫలప్రదం చేసేందుకు ఆంగ్ల టీచర్‌ పీవీఎం నాగజ్యోతి రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ సి.ఎస్‌.ఇ(కమిషనర్‌ ఆఫ్‌ స్కూలు ఎడ్యుకేషన్‌) తమీమ్‌ అన్సారీ ఆమె అధ్యయనాన్ని అభినందించారు. ఈ సందర్భంగా టుర్కూ యూనివర్సిటీ వైస్‌ రెక్టార్‌ మాయ పితోలా ఇంటర్నేషనల్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంటు సర్టిఫికెటు ప్రదానం చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల టీచర్‌గా పనిచేస్తున్న నాగజ్యోతి ఏపీ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా ఫిన్లాండు విద్యా అధ్యయనం పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. అక్కడ వర్సిటీలో గత నెల 17 నుంచి పది రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ఈ నెల 27వ తేదీతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఫిన్లాండ్‌లో విద్యా వ్యవస్థపై

సమగ్ర అధ్యయనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement