అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల్లో నర్సీపట్నంక్రీడాకారులకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల్లో నర్సీపట్నంక్రీడాకారులకు పతకాలు

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

నర్సీపట్నం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఇండోర్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అమరావతి చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీల్లో నర్సీపట్నం క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. బాక్సింగ్‌లో చక్రాంతి రోహిణి, సకిరెడ్డి హరిణి, బొంతు మౌనిక, లగుడు సమంత గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. యర్రా తేజస్విని, కోడూరు కుసుమ సిల్వర్‌ మెడల్స్‌ పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్‌ సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. నర్సీపట్నం క్రీడాకారులను స్పీకర్‌ ప్రత్యేకంగా అభినందించారని శాప్‌ కోచ్‌ అబ్బు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement