● కౌలు రైతు మృతి,మరో ముగ్గురికి గాయాలు
● రేవుపోలవరం రోడ్డులో ఘటన
ఎస్.రాయవరం: మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి వెనుక నుంచి సైకిల్, స్కూటీని ఢీకొట్టడంతో కౌలు రైతు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన రేవుపోలవరం రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రమేష్, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని గుర్రాజుపేట సమీపంలో రేవుపోలవరం రోడ్డులో సైకిల్‌పై వస్తున్న కౌలు రైతు పెంకి మన్నియ్య(65)ను, స్కూటీపై వస్తున్న మరో ముగ్గురిని రేవుపోలవరం నుంచి అడ్డురో డ్డు వైపు వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో మన్నియ్య అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటీపై వస్తు న్న ముగ్గురికి గాయాలయ్యా యి. మృతుడు మన్నియ్యది నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రా మంగా పోలీసు లు గుర్తించారు. గుడివాడలో కొబ్బరి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం పనులు చూసుకుని రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమా దానికి గురయ్యా డు. గుడివాడ శివారు లక్ష్మీపతిరాజుపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన వారు కారు వదిలి పరారయ్యినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


