19న బహుజన ఉద్యోగుల ‘చలో నంద్యాల ’ | - | Sakshi
Sakshi News home page

19న బహుజన ఉద్యోగుల ‘చలో నంద్యాల ’

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

అనకాపల్లి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బహుజన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 19న చలో నంద్యాల నిర్వహించనున్నట్టు రిజర్వేషన్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాయిబోయిన శేఖర్‌ తెలిపారు. స్థానిక నెహ్రూచౌక్‌ ఫెడరేషన్‌ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోన లక్ష్మణ, నాయకులు పల్లా శ్రీను, కుమార్‌, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement