అనకాపల్లి టౌన్: ప్రయాణికుల భద్రతకే భారతీయ రైల్వే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు ఆధునిక చర్యలు చేపడుతున్నామని దక్షిణకోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, స్టేషన్ మాస్టర్ రూమ్‌లో కంట్రో ల్ ప్యానల్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు స్వదేశీ సాంకేతికతతో కూడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ (ఏటీపీ) వ్యవస్థను దశల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఆధుని క ఎలక్ట్రానిక్‌ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్టేషన్‌లో ఒకటవ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై గల ఎస్క్‌లేటర్ పనిచేయకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. వెంటనే మరమ్మ తు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. స్టేషన్ బయట ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. పార్కింగ్‌కు టెండర్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. 21 రోజుల్లో ఆ పనులు పూర్తి చేసి తనకు తెలియజేయాలని ఆదేశించారు. జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా రైళ్లలో అధిక సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారని, ఈ నేపథ్యంలో తీసుకోవలసిన ఏర్పాట్లపై రాజమండ్రి నుంచి విశాఖ మధ్య గల స్టేషన్లను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ కె. రామకృష్ణ, ఆర్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
దక్షిణకోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్


