నాతవరం: ఓటర్ల జాబితా సవరణ(సర్)లో అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కు అవుతున్నారని, టీడీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ పైల సునీల్, జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలఅనర్స, పార్టీ మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం నాతవరంలో శనివారం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మండల స్థాయి అధికారులు టీడీపీ నేతలకు అనుకూలంగా ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ ఒ.చందనరేఖ, ఎంపీడీవో ఎం.సత్యశ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ టి.వి.ఎల్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ బీఎల్‌ఏతో రహస్యంగా సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని, వైఎస్సార్‌సీపీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లకు, స్థానిక ప్రజా ప్రతినిధులైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, ఆపార్టీ బీఎల్‌ఏలతో తహసీల్దార్, ఎంపీడీవో సమావేశం నిర్వహించడం ఎంతవరకు న్యాయమన్నారు. కూటమి నేతలతో అధికారులు కుమ్మకై ్క వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగిస్తున్నారన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజు శిరుసుపల్లి నర్సింగరావు, మంకు సాంబమూర్తి, సైల పోతురాజు, గొర్లే వరహాలబాబు, వేముల సూరిబాబు, మండల యూత్ అధ్యక్షుడు బండారు నాయుడు, మహిళా విభాగం మండల శాఖ అధ్యక్షురాలు ఇనపసప్పల పుష్ప, మాజీ సర్పంచులు గొలగాని రాణి, కాళ్ల ఝాన్సీ, మిరపల వెంకటరమణ, వేముల సూరిబాబు అడిగర్ల నాయుడు, జి.వి.రెడ్డి, నాగు, తమరాన సత్యనారాయణ, గుడపర్తి అచ్చియ్యనాయుడు, వంశీ పాల్గొన్నారు.
అధికారులపై
వైఎస్సార్‌సీపీ నాయకుల మండిపాటు


