దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లికి సమీపంలోని అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ శివారు పెదగంగవరం పొలా ల్లోని బావిలో పడిన సుమారు 13 అడుగుల భారీ గిరినాగును అటవీశాఖ అధికారుల సహకారంతో వన్య ప్రాణుల సంరక్షణకు చెందిన ఈజీడబ్ల్యూఎస్ (ఎన్‌జీవో) ప్రతినిధి మూర్తి కంటి మహంతి బృందం రక్షించింది. సుమారు గంటపాటు శ్రమించి ప్రాణాపాయ స్థితిలో సర్పాన్ని అతి కష్టం మీద బయటకు తీసింది. దానిని సమీప దట్టమైన అటవీ ప్రాంతంలో శనివారం సురక్షితంగా విడిచిపెట్టారు. పెదగంగవరం గ్రామం సమీ పంలోని బావిలో భారీ గిరినాగు ఉండడాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జీనబాడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి.శివకుమార్, బీటు ఆఫీసర్ సాయి ప్రణీత్‌తో పాటు అటవీశాఖకు చెందిన రాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ (ట్రిపుల్‌ఆర్) బృంద నాయకుడు ఆర్.రాంబాబు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఈజీడబ్ల్యూఎస్ ప్రతినిధి మూర్తి కంటి మహంతి తన బృంద సభ్యులు కృష్ణ, ప్రసాద్‌తో కలిసి అక్కడికి చేరుకుని గిరినాగును అతికష్టం మీద బయటకు తీశారు. పెదగంగవరానికి చెందిన రమేష్ తదితర గ్రామస్తులు సహకారం అందించారు.
అతికష్టం మీద బయటకు తీసిన
అటవీశాఖ ఉద్యోగులు


