అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్, డిపో అధ్యక్షుడు కె.ఎన్.వి. రమేష్ ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిపో గేటు వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో అసోసియేషన్ ఉద్యోగులు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీ్త్ర శక్తి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, రద్దీకి తగ్గట్టుగా కొత్త బస్సులను తక్షణమే ఏర్పాటు చేయాలని, అనకాపల్లి డిపోలో అక్రమంగా సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లో తీసుకోవాలని, గ్యారేజీలో మెకానిక్ ఉద్యోగులకు పనిముట్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


