రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

అనకాపల్లి: స్థానిక డైట్‌ కళాశాల వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కేదారశెట్టి నాగవెంకట సత్య అరుణ్‌కుమార్‌ (35) మృతిచెందాడు. అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి ట్రాఫిక్‌ ఎస్‌ఐ డి.శేఖరం చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఆటోలో కూలింగ్‌ డ్రింక్స్‌ తరలిస్తూ జీవనం సాగిస్తున్నాడని, శనివారం రాత్రి ఆటో రిపేరు రావడంతో అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద బాగుచేసేందుకు ఇచ్చి, టిఫిన్‌ చేసేందుకు హైవే దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఎస్‌ఐ చెప్పారు. మృతుడి తండ్రి గురుమూర్తి గుప్త ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement