మునగపాక: మండలంలోని ఒంపోలు గ్రామానికి చెందిన ఉల్లింగల మనస్వి 37వ జాతీయ కూచిపూడి సోలో నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానం సాధించింది. ఒంపోలుకు చెందిన వరసత్య,దుర్గాదేవి కుమార్తె మనస్వి చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యంలో రాణిస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో 8,9,10,11,12 తేదీల్లో నిర్వహించిన 37వ జాతీయ కూచిపూడి నృత్య పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. ఆమెకు ప్రశంసా పత్రంతో పాటు షీల్డు అందజేశారు. మనస్వికి గురువు స్పందన తర్ఫీదు ఇస్తున్నారు. మనస్వి తృతీయస్థానం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.


