అనాథ మృతదేహానికి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

మాడుగుల రూరల్‌ : దిక్కులేని ఆనాథ శవానికి అంత్యక్రియలు చేసి, తన మానవత్వాన్ని చాటుకున్నారు, మాడుగుల గ్రామస్తులు. ఊరూ పేరు తెలియని 70 ఏళ్ల వృద్ధుడు ఏడాది కాలంగా మాడుగులలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న హోటలు వద్ద, అన్న క్యాంటన్‌ వద్ద తిరుగుతూ వారు పెట్టే టిఫిన్‌, భోజనం తింటూ ఉండేవాడు. అతను శుక్రవారం రాత్రి మాడుగులలో దుర్గాలమ్మ గుడి పరిసరాల్లో గల ఎన్టీఆర్‌ కళాక్షేత్రం కళావేదిక మీద మృతి చెందారు. ఆయనకు ఎవరూ లేకపోవడంతో అనాథ కావడం వల్ల ఎవరూ ముందుకు రాలేదు. శనివారం ఈ పరిస్థితిని గమనించిన మాడుగుల పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ కోట్నాల త్రినాఽథరావు, స్థానిక మన్యంజ్యోతి సేవా సంఘం అధ్యక్షుడు మండల సతీష్‌తో పాటు స్థానిక బట్టల షాపు యజమానురాలు షేక్‌ షబ్బీర్‌ కొంత నగదు అందించారు. కొంతమంది స్థానికుల వద్ద విరాళాలు సేకరించి మృతుడికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ నారాయణరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి నాయుడుకు తెలియజేసినట్టు మండల సతీష్‌ తెలిపారు.

మానవత్వం చాటుకున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement