పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

అనకాపల్లి: కుటుంబ కలహాల కారణంగా స్థానిక ఏఎంసీ కాలనీకి చెందిన జీవీఎంసీ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుడు బండి అప్పారావు (28) అలియాస్‌ చంటి శనివారం తెల్లవారుజామున సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పారావు మద్యానికి బానిసవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య కరుణ మూడు రోజుల కిందట ఇద్దరు పిల్లలను తీసు కుని అనపర్తిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఏఎంసీ కాలనీలోని సోని యా గాంధీ బ్లాక్‌ రెండో అంతస్తులో అప్పారావు ఒక్కడే ఉంటున్నాడు. పక్క ఇంట్లో మృతుడి తల్లి వెంకట నూకరత్నం నివాసముంటోంది. తల్లి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కొండలరావు ఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement