ఎన్నికల్లో ‘కూటమి’కి బుద్ధి చెప్పడం ఖాయం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ‘కూటమి’కి బుద్ధి చెప్పడం ఖాయం

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

తెలుగు శక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌

నర్సీపట్నం: త్వరలో రాబోయే జీవీఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కూటమి’కి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగు శక్తి పార్టీ అధ్యక్షుడు బి.వి.రామ్‌ అన్నారు. నర్సీపట్నంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తప్పు చేసిన వారు ఎవరైనా నిలదీస్తామని చెప్పారు. అల్లూరి స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. పదవులు చూసుకుని మురిసిపోయే రోజులు పోయాయన్నారు. ప్రజల కోసం పనిచేసే నిజమైన సేవకులను తెలుగు శక్తి పార్టీ తయారు చేస్తుందని చెప్పారు. ప్రజా సేవను వ్యాపారంగా మార్చిన ప్రజాప్రతినిధులను తరిమి కొట్టాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement