పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉండాలి.
–జి.అప్పారావు నాయుడు,
డీఈవో, అనకాపల్లి జిల్లా
జిల్లాలో 29 స్టోరేజ్ పాయింట్స్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను 29 స్టోరేజ్ పాయింట్స్ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రపరిచారు. పోలీసు సిబ్బంది కాపలా మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


