అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగ సందర్భంగా శనివారం అమ్మవారి మాలధారుల సంఘం వ్యవస్థాపకుడు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో భారీ ఎత్తున గరగలతో ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి ఆలయం వద్ద సుమారు ఐదు వేల మందికి మాలాధారణ, ఇతర భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ప్రతి ఏడాది కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలోఅన్నసమారాధన, గరగల ఊరేగింపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఊరేగింపు సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపులో వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని పూజలు చేశారు. మాలధారణ కమిటీ కొలిమేర శ్రీను, ఉదయ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ను సన్మానించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు కె.ఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


