కొత్త అమావాస్య ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కొత్త అమావాస్య ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

Mar 15 2026 1:16 AM | Updated on Mar 15 2026 1:16 AM

అమ్మవారిని దర్శించుకుంటున్న

దేవదాయశాఖ రీజనల్‌ కమిషనర్‌ సుజాత

అనకాపల్లి: కొత్త అమావాస్య జాతర సందర్భంగా నూకాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ రీజనల్‌ కమిషనర్‌ ఎన్‌.సుజాత అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఆలయాన్ని శనివారం ఆమె సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్త అమావాస్య జాతర, నెలపండగ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు రెండు నెలలపాటు అమ్మవారి దర్శనానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా వస్తారని తెలిపారు. ఆలయ సహాయ కమిషనర్‌ యళ్ల శ్రీధర్‌, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement