రాజీయే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం

Mar 15 2026 1:16 AM | Updated on Mar 15 2026 1:16 AM

అనకాపల్లి: కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని జిల్లా పదోఅదనపు న్యాయమూర్తి, ఎంఎల్‌ఎస్‌సీ జిల్లా చైర్మన్‌ వి.నరేష్‌ తెలిపారు. స్థానిక న్యాయ స్థానాల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి సమయాన్ని వృథాచేసుకోవద్దని సూచించారు. మొత్తం 1,697 కేసుల్లో 768 మంది కక్షిదారులకు రూ.6,05,17,768 చెల్లించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు ిపి.నాగేశ్వరరావు, జి.రామకృష్ణ, జి.ధర్మారావు, ఎ.రమేష్‌, బి.వి.విజయలక్ష్మి, నిఖితా సెంగర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరశ్రీనివాసరావు, కార్యదర్శి బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తి నరేష్‌

Advertisement
 
Advertisement
Advertisement