విద్యార్థులను దీవిస్తున్న తల్లిదండ్రులు
నర్సీపట్నం: మండలంలో చెట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయీభవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజయీభవ అంటూ దీవించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎంఈవో నాగేంద్ర హాల్ టికెట్లు అందజేశారు. ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షలు రాసేందుకు అవసరమైన సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సరోజిని, స్కూల్ చైర్మన్ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


