● మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
● కార్పొరేటర్ మందపాటి దంపతులకు ఆత్మీయ సత్కారం
అనకాపల్లి: అభివృద్ధిలో ఆదర్శంగా 82వ వార్డు నిలిచిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జీవీఎంసీ 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకీరామరాజు దంపతుల ఆత్మీయ సమావేశం నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 82వ వార్డు పరిధిలో సుమారుగా రూ.15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పదవీ కాలం ముగిసినా ప్రజలకు సేవ చేస్తే రాజకీయ జీవితచరిత్రలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. వార్డు పరిధిలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్టు ఐదేళ్ల పాలనలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మేయర్‌పై కూటమి నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాలను పాటించిన కార్పొరేటర్‌గా మందపాటి సునీత చరిత్రలో నిలిచిపోతారన్నారు. మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ జీవీఎంసీ సమావేశాల్లో వార్డు అభివృద్ధి పనులపై ఎక్కువగా దృష్టి సారించి, పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేశామన్నారు. కార్పొరేటర్ మందపాటి సునీత మాట్లాడుతూ అందరి సహకారంతో వార్డు పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అనంతరం కార్పొరేటర్ మందపాటి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీవీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, దంతులూరి దిలీప్‌కుమార్, నియోజకవర్గలో వివిధ అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, 80, 81, 84 వార్డు ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కె.రాఘవ, పార్టీ సీనియర్ నాయకులు జి.రామమూర్తి, కాండ్రేగుల విష్ణుమూర్తి, హైమావతి, కె.పద్మకుమారి, పలకా సత్యనారాయణ, ఆడారి శ్రీను, మర్రిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు.


