ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
సబ్బవరం: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందుతుందని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. మండంలోని గొటివాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ డ్రైవ్ గ్రామస్తుల సహకారంతో ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి హాజరైన డీఈవో..తల్లిదండ్రుల్ని ఒప్పంచి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, వారి విద్యా భవిష్యత్‌కు శుభారంభం కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీవీ ఆనంద్, పాఠశాల కమిటీ చైర్మన్ గొర్లి నూకరాజు, అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి, పూర్వ విద్యార్థి దినకర్ తదితరులు పాల్గొన్నారు.


