లెట్యూస్‌తో మంచి రాబడి
మాది అరకు నియోజకవర్గంలోని దేముడువలస. గత పదేళ్లుగా ఎంవీపీ రైతు బజార్‌లో కూరగాయలు విక్రయిస్తున్నాను. గత కొన్నేళ్లుగా కేబేజీ పంటను పండిస్తున్నాం. అయితే ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో నష్టాలను చవిచూస్తున్నాం. దీంతో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న లెట్యూస్ పండించాలని నిర్ణయించాను. ఇది మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూర పంట కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. విటమిన్ ఏ, విటమిన్ కే లు పుష్కలంగా ఉండటంతో పోషకాహారం కోరుకునే వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రెస్టారెంట్‌లలో శాండ్‌విచ్‌లు, సూప్‌లు, బర్గర్‌లలో కూడా విరివిగా దీన్ని వాడుతుండటంతో బయట మార్కెట్‌లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంతో 30 సెంట్లలో ఈ పంట పండించగా ఏడాదికి 1/2 టన్ను దిగుబడి వస్తోంది. రైతు బజార్‌లో లెట్యూస్ కేజీ ధర రూ.80కి విక్రయిస్తుండగా బయట మార్కెట్‌లో దీని ధర కేజీ రూ.200లకు పైగా పలుకుతోంది. దీంతో మూడేళ్లుగా పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో లెట్యూస్ పండించి మార్కెట్ చేయాలని భావిస్తున్నాను.
– పాంగి గోపినాథ్, రైతు అరకు


