ఏపీ ఎన్‌జీజీవోస్ జిల్లా అధ్యక్షునిగా సూర్యనారాయణ
ఏపీ ఎన్‌జీజీవోఎస్ నూతన కార్యవర్గం
అనకాపల్లి: ఏపీ ఎన్‌జీజీవోస్ జిల్లా అధ్యక్షునిగా పి.సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థా నిక గాంధీనగరం ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షునిగా పి.దాలినాయుడు, ఉపాధ్యక్షులుగా ఎ.జె.సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు, డి.ఆనందరావు, ఎస్.సత్యనారాయణ, రేవతి, కార్యదర్శిగా డి.శేషుకుమార్, సహాయ కార్యదర్శులుగా యు.ఎస్.వి.శ్రీనివాసరావు, సీహెచ్. బాబూరావు, డి.కొండలరావు, ఎస్.శ్రీనివాసరావు, కె. కిరణ్‌కుమార్‌రాజు, వి.చిరంజీవి, సి.సంతోష్‌కుమార్, పి.త్రినాథ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.వి.రమణబాబు, కోశాధికారిగా పి.త్రినాథ్‌తోపాటు మరికొంతమంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కొత్త కమిటీ మూడు సంవత్సరాలు పదవిలో ఉంటుంది.


