విద్యుత్ షాక్ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం
అచ్యుతాపురం రూరల్: ఆపదలో ఉన్న వారికి అచ్యుతాపురం హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందజేస్తోంది. విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన నవీన్‌కు ఆ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. ఆదివారం రూ.1.02 లక్షలు అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వీలుగా తమకు విరాళాలు అందజేస్తున్న వారికి సంస్థ అధ్యక్షుడు రెడ్డి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్స్ నాయుడు, రెడ్డి చిరంజీవి, రాజాన అశోక్, డాక్టర్ సుధీర్, డాక్టర్ వెంకట్, సురేష్, గొర్లి వెంకటేష్, కొల్లి నాయుడు, పిడి శివాజీ, ధర్మిరెడ్డి శ్రీనివాస్, లాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.


