మిగిలిన మూడు మండలాలను ‘అనకాపల్లి’లోనే కొనసాగించాలి
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్
సమన్వయకర్త ప్రసాద్
మునగపాక: ప్రజల నిరసనకు తలొగ్గి మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని, అయితే నియోజకవర్గంలో మిగతా మూడు మండలాలను కూడా ఈ డివిజన్‌లోనే ఉంచాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా నక్కపల్లి కొత్త డివిజన్‌లో కలిపేలా జీవో జారీ చేయడంతో రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి పలు ఉద్యమాలు చేపట్టిన ఫలితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన మూడు మండలాలను కూడా అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించేలా చూడాలని కోరారు.


