జిల్లా వీఆర్వోల సంఘం కార్యవర్గం
నూతనంగా ఎన్నికై న గ్రామ రెవెన్యూ
అధికారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు
అనకాపల్లి టౌన్/కె.కోటపాడు: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమిరపు శశిధర్, ఉపాధ్యక్షుడిగా పూడి సురేష్, ప్రధాన కార్యదర్శిగా ఈరెళ్ళ శివ శంకర్, అసోసియేట్ అధ్యక్షుడిగా వేవాడ చిన్నం నాయుడు, కోశాధికారిగా ఆశ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శంకర్, బి.శ్రీనివాసరావు, డి.రాజేష్, పలివెల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


