నాట్య మయూరాలు
కె.కోటపాడు/పాయకరావుపేట: హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో 4,608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు నృత్యం చేసి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. కె.కోటపాడు మండలం కింతాడ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ఉపసర్పంచ్ ముత్యాలనాయుడుల మనుమరాలు తాన్విశ్రీ , కావ్యశ్రీ నృత్య కళాశాలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. వీరికి నిర్వాహకులు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఈ ప్రదర్శనలో తమ పాప తాన్విశ్రీ పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందని తల్లిదండ్రులు ఈశ్వరరావు, మాధవి తెలిపారు. తాన్విశ్రీ సుజాతనగర్‌లో శోభిల్లు కళా నిలయంలో శిక్షణ పొందుతున్నట్టు వారు చెప్పారు. తమ విద్యార్థులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొనడం ఆనందంగా ఉందని కావ్య శ్రీ నృత్య కళాశాల శిక్షకురాలు ఏలూరి దీపిక తెలిపారు. పాయకరావుపేటకు చెందిన 32 మంది బాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు.
నాట్య మయూరాలు


