నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించాలి
అనకాపల్లి టౌన్: రాష్ట్రప్రభుత్వం నూతన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)ను నియమించాలని, ఐఆర్ మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాఽథ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయించాలని, డీఏ, ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. సంఘం సీనియర్ నేత బి.వెంకటపతి రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. విద్యా శాఖపై ఇతర శాఖల అధికారుల పెత్తనం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వి.వి.ఎ. ధర్మారావు, ఎస్.దుర్గా ప్రసాద్, మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, సన్యాసినాయుడు, కొణతాల గణేష్, నూకేష్, బాపునాయుడు, నరసయ్య నాయుడు, కన్నారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించాలి


