విద్యార్థులపై కోతి దాడి
రావికమతం: స్థానిక హైస్కూల్‌లోకి కోతి చొరబడి ఇద్దరు విద్యార్థులను గాయపరిచింది . స్థానిక మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న హైస్కూలోకి శనివారం ఓ కోతి ప్రవేశించి వేపాడ భాగ్యశ్రీ ,తాడి దుర్గా తేజపై దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం హరిబాబు ,ఉపాధ్యాయులు వేపాడ సత్యనారాయణ,ధనంజయ్ తదతరులు ఎంపీడీవో మహేష్ కు,తహసీల్దార్ కార్యాలయంలో,ఎంఈవోకు వినతిపత్రాలు అందజేశారు.
విద్యార్థులపై కోతి దాడి


