సీపీఎం నేతపై పీడీ యాక్ట్ రద్దు చేయాలి
నర్సీపట్నం: ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, అప్పలరాజు భార్య లక్ష్మి శనివారం నర్సీపట్నంలో కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రౌడీలు, స్మగ్లర్లు, దేశద్రోహులుపై పెట్టాల్సిన కేసులను అప్పలరాజుపై పెట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రౌడీలు బయట హల్‌చల్ చేస్తున్నారన్నారు. పీడీ యాక్ట్ పెట్టడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే పీడీ యాక్ట్ రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


