జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఉమ్మలాడ జంక్షన్ వద్ద శనివారం ఓ వ్యాన్ దగ్ధమైంది. ఖాళీ సిగరెట్ ప్యాకెట్ల లోడ్‌తో కోల్‌కతా నుంచి కోయంబత్తూరు వెళుతున్న వ్యాన్ ఉమ్మలాడ జంక్షన్‌కు వచ్చే సరికి ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో మంటలు వ్యాపించాయి. అదే రూట్‌లో ప్రయాణిస్తున్న వారు ఈ విషయాన్ని డ్రైవర్‌కు తెలపడంతో వ్యాన్‌ను నిలిపివేశాడు. మంటలు తీవ్రంగా వ్యాపించి వాహనం ముందుభాగంతో పాటు ఖాళీ సిగరెట్ పెట్టలు దగ్ధమయ్యాయయి. ఈ ప్రమాదం వల్ల రూ.10 లక్షల నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరావు తెలిపారు.


