కొత్తకోట ఏఎస్‌ఐకు రాష్ట్ర స్థాయి పురస్కారం
అవార్డు అందుకుంటున్న ఏఎస్‌ఐ అప్పారావు
రావికమతం: మండలంలో కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ అప్పారావు కమెండేషన్ డిస్క్ –2025, బ్రాంజ్ డిస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు జిల్లాలో 14 మందిని ఎంపిక చేస్తూ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొత్తకోట ఏఎస్‌ఐ అప్పారావు తన 36 ఏళ్ల సర్వీస్‌లో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేయడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అమరావతిలో డీజీపీ నుంచి పురస్కారం అందుకున్నారు. 1989లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. 2005లో సివిల్ కానిస్టేబుల్, 2010లో హెడ్ కానిస్పేబుల్‌గా, 2014లో ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, జి.మాడుగుల, సీలేరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది అభినందించారు.


