రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు
రావికమతం : టి.అర్జాపురం శివారు చిలకవానిపాలెం ఇటికుల బట్టీ దగ్గరలో బి.ఎన్.రోడ్డు మార్గంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా వమ్మంగి, ధర్మవరం గ్రామాలకు చెందిన షేక్ మీరా సాహెబ్, వాసులు ఇరువురు కాకినాడ నుంచి పాడేరు వెళుతుండగా వి.మాడుగుల మండలం కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన కోన జగ్గారావు, పొంగలిపాక గ్రామానికి చెందిన శెట్టి నాయుడు ఇరువురు కలిసి నర్సీపట్నం వైపు వెళ్లుతున్నారు. చిలకవానిపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ మీరా సాహెబ్‌కు చేతికి, వాసుకు తలకు బలమైన గాయాలయ్యాయి. కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని క్షతగాత్రులకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు అందలేదని కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.


