రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నర్సీపట్నం : మాకవరపాలెం మండలం, పైడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బూరుగుపాలెం గ్రామానికి చెందిన వానపల్లి లోవరాజు (23) రాచపల్లి అన్‌రాక్ పయనీర్ రిఫైనరీ కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా బైక్‌లు ఢీ కొనడంతో లోవరాజు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో విశాఖకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చేతికి అందించి వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి ఎస్‌ఐ దామోదర్‌నాయుడు దర్యాప్తు చేస్తున్నారు.


