ఇంటి స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య కోట్లాట
రావికమతం: మండలంలోని కొత్తకోటలో ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య జరిగిన కోట్లాటలో ముగ్గురు గాయపడ్డారు. కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు కొత్తకోటకు చెందిన అడ్డూరి భూలేక, కలం రాజమోహన్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 218–6లో గల 206 గజాల ఇంటి స్థలాన్ని శ్యామల దగ్గర 2016లో కొనుగోలు చేశామని రాజమోహన్ తెలిపారు. 218 సర్వే నంబర్‌లో 1947లో తమ పూర్వీకులు 780 గజాలు కొనుగోలు చేశారని ఆనంద్ పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. రాజమోహన్ కోర్డుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని గురువారం వివాదాస్పద స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అడ్డూరి అనంద్, తండ్రి భూలేక అభ్యంతరం తెలిపారు. దీంతో కలం రాజమోహన్, అతడి తల్లి లక్ష్మి, అడ్డూరి భులేక, ఆనంద్ ఘర్షణ పడ్డారు. చేతికి దొరికిన వస్తువులతో పరస్పరం దాడులు చేసుకుని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఆనంద్, భులేక, కలం రాజమోహన్‌ల తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారికి కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చిక్సిత చేయించి అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
గాయపడ్డ కలం రాజమోహన్, అడ్డూరి భులేక, అడ్డూరి ఆనంద్
ఇంటి స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య కోట్లాట
ఇంటి స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య కోట్లాట


