పాము కాటుతో మహిళ మృతి
బుచ్చెయ్యపేట: నీలకంఠాపురం గ్రామానికి చెందిన మహిళ పాము కాటుతో మృతి చెందింది. గ్రామానికి చెందిన మలమంచిలి ధనలక్ష్మి(25) మంగళవారం చోడవరం మండలం దామునాపల్లిలో పుట్టింటికి వెళ్లింది. పొలంలో వరి కుప్పలు పెడుతున్న తల్లిదండ్రులకు పొలం గట్లపై నుంచి నడిచి భోజనాలు తీసుకెళ్తుండగా ఆమె కాలిపై పాము కాటు వేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త శ్యామ్ సంతోష్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
పాము కాటుతో మహిళ మృతి


