ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?
మిగతా 8వ పేజీలో
సీపీఎం నేత అప్పలరాజుపై తప్పుడు కేసును ఎత్తివేయాలి
రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయబోమని చెప్పిన సీఎం
మత్స్యకారుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్టు ఎందుకు చేయాలి
అప్పలరాజు అరెస్టుపై జిల్లా అంతటా నిరసనలు
దేవరాపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజుపై నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని స్థానిక సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రం దేవరాపల్లిలో అప్పలరాజుపై తప్పుడు కేసులను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేత డి.వెంకన్న మాట్లాడుతూ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు మూడు నెలల వ్యవధిలో ఏడుసార్లు అప్పలరాజు అరెస్టు అయ్యారనే నెపంతో తప్పుడు సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉద్యమానికి మద్దతు పలికిన సీపీఎం నేతపై ఈ కేసులు నమోదు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు బల్క్‌డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొని మత్స్యకారులకు తీవ్ర ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. సిహెచ్.దేముడు, సిహెచ్.రాంబాబు, పి.దేముడు, కె.శ్రీను, కె.సుధాకర్, ఆసిబోయిన నాయుడు, సిహెచ్.లక్ష్మి తదితర సీపీఎం శ్రేణులు పాల్గొన్నారు.
అప్పలరాజు కుటుంబ సభ్యులకు పరామర్శ
ఎస్.రాయవరం: సీపీఎం నాయకుడు అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసి అడవివరం సెంట్రల్ జైల్లో పెట్టడం దారుణమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అన్నారు. ధర్మవరం అగ్రహారంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను బుధవారం సీపీఎం కేంద్ర కమిటీ బృందం పరామర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గణిశెట్టి సత్యనారాయణ తదితరులు కుటుంబ సభ్యులను కలిశారు. అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం అడ్డురోడ్డు జంక్షన్‌లో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, చమనబాల రాజేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
తక్షణమే విడుదల చేయాలి
అనకాపల్లి: ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుపై పీడీ యాక్టు రద్దుచేసి, తక్షణమే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్క్ అనుమతులు రద్దు చేయాలని ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించిన ిఅప్పలరాజుపై పీడీయాక్టు కేసులు బనాయించి, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం అప్రజాస్వామికమని, ప్రభుత్వం తక్షణమే కేసును
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?


