వికసిత్ భారత్‌కుసుంకపూరు యువకుడు
కోటవురట్ల: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ)–2026కు మండలంలోని సుంకపూరుకు చెందిన పోలిరెడ్డి శ్యామ్‌కుమార్ ఎంపికయ్యారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో గుంటూరులో నిర్వహించిన పోటీలో పోలిరెడ్డి శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయిలో 2026 జనవరి 12న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వీబీవైఎల్‌డీకి శ్యామ్‌కుమార్ ఎంపికయ్యారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో ‘ప్రజాస్వామ్యం–ప్రభుత్వంలో యువత పాత్ర’ అనే అంశంపై తన ఆలోచనలను పంచుకోనున్నట్టు శ్యామ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం శ్యామ్‌కుమార్ జాగ్రఫీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. తనకు ఈ అవకాశం దక్కడం ఎంతో గర్వంగా ఉందని శ్యామ్‌కుమార్ తెలిపారు.


