
ఒడ్డిమెట్ట గణపతి ఆదాయం రూ.4 లక్షలు
ఒడ్డిమెట్టలో హుండీలు లెక్కిస్తున్న దేవదాయ శాఖ అధికారులు
నక్కపల్లి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన ఒడ్డిమెట్ట లక్ష్మీగణ పతికి ఒక్క రోజు ఆదాయం సుమారు రూ.4 లక్షలు లభించిందని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైలా నూకన్న నాయుడు తెలిపారు. గురువారం దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీల ను లెక్కించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా రూ.20 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ద్వారా రూ56,230, రూ.10 టికెట్ల ద్వారా రూ.53,300, తలనీలాలు టికెట్ల ద్వారా రూ.3500, దాతలు ఇచ్చిన విరాళాలు ద్వారా రూ.82,960, భక్తులు హుండీల్లో వేసిన కానుకల ద్వారా రూ.2,03,091 మొత్తం రూ 3,99,081 లభించిందన్నారు.