ఎస్.రాయవరం : ధర్మవరం–ఎస్.రాయవరం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ధర్మవరం సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా గురువారం ఢీకొట్టుకోవడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్టు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. ఈ ప్రమాదంలో పెనుగొల్లు గ్రామానికి చెందిన సీహెచ్. సుశీలకు కాలు విరిగినట్టు చెప్పారు. ఎస్.రాయవరానికి చెందిన పెద్దేటి కొండలరావు, రాజులమ్మలకు గాయాలయ్యాయి. వారిని చికిత్సకు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కాలు విరిగిన మహిళను అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.