
రోడ్డు మధ్య నిలిచిపోయిన లారీ..
రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అవస్థలు
గన్నవరం మెట్ట వద్ద ప్రయాణికులు అవస్థలు
నాతవరం : నర్సీపట్నం తుని మధ్య అర్‌అండ్‌బీ రోడ్డుపై గన్నవరం మెట్ట సమీపంలో ట్రాఫిక్ అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు జిల్లాల సరిహద్దులో గన్నవరం మెట్ట వెదుళ్లగెడ్డ వద్ద సిమ్మెంటు లోడుతో పెద్ద లారీ రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. వాహనాలు రాకపోకలు సాగించలేని విధంగా రోడ్డు మధ్యలో ఉండిపోవడంతో నర్సీపట్నం తుని డిపోల నుంచి రాకపోకలు సాగించే ఆర్‌టీసీ బస్సులు సుమారుగా రెండు గంటలు నిలిచిపోయాయి. అదే విధంగా ఇతర ప్రైవేటు వాహనాలు సైతం నిలిచిపోవడంతో అటు కోటనందూరు ఇటు ఎ.శరభవరం వరకు వాహనాలు రోడ్డుపై నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొక్లెయిన్ సాయంతో సిమెంటు లారీని పక్కకు తీయడంతో వాహనాలు రాకపోకలు సాగించాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైలు సమయం దాటిపోవడంతో అందోళన వ్యక్తం చేశారు.