
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు వెదురుపర్తి విద్యా
శ్రీజత, హాసినిలతో ఉపాధ్యాయులు
కశింకోట: వెదురుపర్తి హైస్కూలుకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల లంకెలపాలెంలో జిల్లా స్థాయిలో టీం సెలక్షన్స్ జరిగాయి. దీనిలో జూనియర్ విభాగంలో హైస్కూలుకు చెందిన ఎన్.శ్రీజత, కె.హాసిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు హెచ్‌ఎం కె.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, పీ డీ ఎ.నూకరాజు సోమవారం తెలిపారు. వీరు వ చ్చే నెలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వీరికి అభినందనలు తెలిపారు.